Share News

హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విమానం కేసీ-135 అదృశ్యం..

ABN , Publish Date - May 06 , 2026 | 10:19 AM

అమెరికా సైనిక యుద్ధ విమానం కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ అదృశ్యమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి.

హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విమానం కేసీ-135 అదృశ్యం..
US KC-135 Stratotanke

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సైనిక యుద్ధ విమానం కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ అదృశ్యమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఖతార్ వద్ద పబ్లిక్ రాడార్ నుంచి అదృశ్యమైంది. విమానాలకు గాల్లో ఇంధనం నింపి వస్తుండగా కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ కనిపించకుండా పోయింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఈ విమానం అదృశ్యం ఆందోళనలకు దారి తీస్తోంది.


విమానాలకు ఇంధనం నింపి కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ తిరిగి సైనిక స్థావరం వైపు వెళ్తుండగా రాడాన్ నుంచి సిగ్నల్ కోల్పోయింది. సంబంధాలు తెగిపోవడానికి ముందు గ్లోబల్ సిగ్నల్ 7700 అనే అత్యవసర కోడ్‌ను కేసీ-135 పంపినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తోంది. సాంకేతిక సమస్యలు, అగ్నిప్రమాదం, వైద్య అత్యవసర పరిస్థితి, బయట నుంచి వచ్చే ముప్పు వంటి సందర్భాల్లో 7700 కోడ్‌ను విమానాలు పంపుతుంటాయి. అయితే, కేసీ-135 మిస్సింగ్ గురించి అమెరికా సైన్యం గానీ, ఇరాన్ అధికారులు గానీ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.


కేసీ-135ని విమానాల్లో ఇంధనం నింపేందుకు అమెరికా వైమానిక దళం వాడుతుంటుంది. దీన్ని ఎగిరే గ్యాస్ స్టేషన్ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా యుద్ధ విమానాలు, బాంబర్లు, ఇతర విమానాలకు ఇది గాలిలోనే ఇంధనం నింపుతుంటుంది. ఇలా చేయడం ద్వారా ఇంధనం కోసం విమానాలు భూమి పైకి రాకుండా ఎక్కువసేపు గాలిలోనే ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సరకులు, ప్రయాణికుల రవాణా, అత్యవసర వైద్య సేవల తరలింపు వంటి మిషన్లకూ దీన్ని వాడుతుంటారు. కాగా, ఈ విమానాన్ని బోయింగ్ 707 నమూనా ఆధారంగా రూపొందించారు. 60 సంవత్సరాలకు పైగా కేసీ-135 సేవలు అందించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా పేల్చేస్తా!

పాకిస్థాన్ విజ్ఞప్తి వల్లే ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా ఆపాం: డొనాల్డ్ ట్రంప్

Updated Date - May 06 , 2026 | 10:44 AM