Share News

ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు రూ.4.18 లక్షల కోట్ల ఖర్చు

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:05 AM

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా మిలిటరీకి అయిన వ్యయం ఈ నెల 3వ తేదీ నాటికి రూ.4,18,278.78 కోట్లకు...

ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు రూ.4.18 లక్షల కోట్ల ఖర్చు

  • చట్టసభల సభ్యులకు నివేదిక అందజేత

వాషింగ్టన్‌, సెప్టెంబరు 19: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా మిలిటరీకి అయిన వ్యయం ఈ నెల 3వ తేదీ నాటికి రూ.4,18,278.78 కోట్లకు(43.6 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన వ్యయాన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తాజాగా లెక్కించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఈ వారం అమెరికా చట్టసభల సభ్యులకు అందజేశారు. గత మంగళవారం అమెరికా కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ఇరాన్‌ యుద్ధంలో ఆగస్టు 1 నాటికి అమెరికా మిలిటరీకి రూ.3,64,554.9 కోట్ల(38 బిలియన్‌ డాలర్లు) వ్యయం అయినట్టు పేర్కొన్నారు. అంటే ఈ ఒక్క నెలలోనే రూ.53,723.88 కోట్ల(5.6 బిలియన్‌ డాలర్లు) ఖర్చు అయ్యింది. ఈ యుద్ధంలో 18 మంది అమెరికన్‌ సైనికులు చనిపోయారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 06:05 AM