యూఎస్, చైనా, రష్యాల ఉమ్మడి డిక్లరేషన్.. ఇరాన్‌కు షాక్ తప్పదా!
ABN , Publish Date - Nov 19 , 2026 | 10:16 PM
అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా, చైనా, రష్యా సంయుక్త ప్రకటన చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా, చైనా, రష్యా తాజాగా సంయుక్త ప్రకటన చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అణుకార్యక్రమం తమ హక్కు ఉంటూ ఇరాన్ నినదిస్తున్న వేళ ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో పోరాడుతున్న ఇరాన్‌కు ఇంతకాలం మద్దతుగా నిలిచిన రష్యా, చైనాలు అణునిరాయుధీకరణ దిశగా ఓ సంయక్త ప్రకటన చేయడం కీలక పరిణామమని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు కామెంట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షెన్‌జెంగ్ వేదికగా త్రైపాక్షిక సమావేశంలో నేడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ మూడు దేశాల అధినేతలు సమావేశంలో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన నేతలు శాంతిస్థాపనకే తాము కట్టుబడి ఉన్నామంటూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. అణుయుద్ధంలో గెలుపు అనేదే ఉండదని స్పష్టం చేశారు. అలాంటి యుద్ధం ఎన్నడూ జరగకూడదని తీర్మానించారు. అణుముప్పు తగ్గించేందుకు అణునిరాయుధీకరణ దిశగా చర్చలు జరపాలని అంగీకరించారు.
ఈ తీర్మానం నేపథ్యంలో ఇరాన్‌కు చిక్కులు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా తీర్మానంలో ఇరాన్ ప్రస్తావన లేదు. అయినప్పటికీ, రష్యా, చైనాలు అమెరికాతో కలిసి ఈ ప్రకటన చేయడంతో ఇరాన్ ఇకపై తన అణుకార్యక్రమాన్ని కొనసాగించడం అంత ఈజీ కాబోదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాము పౌర అవసరాల కోసమే అణుకార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతోంది. అది తమ హక్కని కూడా వాదిస్తోంది. దీంతో, ఇరాన్ తదుపరి చర్యలు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరలో భారతీయులకు మలేషియాలో వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం రద్దు
బ్రిటన్ ప్రిన్స్ విలియమ్‌కు భారత మూలాలు! 200 ఏళ్ల నాటి చరిత్ర