చైనాకు చెక్.. అమెరికా, భారత్ క్రిటికల్ మినరల్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:40 PM
క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక దశలోకి ప్రవేశించింది. అమెరికా-ఇండియా క్రిటికల్ మినిరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం గత వారంలో జరిగింది.
వాషింగ్టన్: క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనాపై ఆధారపడటాన్ని, ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక దశలోకి ప్రవేశించింది. అమెరికా-ఇండియా క్రిటికల్ మినిరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం గత వారంలో జరిగింది. రెండు దేశాలకు చెందిన 17 ప్రముఖ సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఖనిజాల ప్రాసెసింగ్, తయారీ, సాంకేతిక అభివృద్ధి, పెట్టబడులు, సరఫరా గొలుపు బలోపేతంపై చర్చించాయి. గత నెలలో ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది.
సాంకేతికత, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి చారిత్రక వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై క్వాడ్ సమావేశంలో అమెరికా, భారత్ సంతకాలు చేశాయి. ఆ ప్రకారం కీలకమైన ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ ప్రక్రియల్లో ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి. కొత్త ప్రాజెక్టులకు నిధుల సమీకరణలో పరస్పరం సహాయం చేసుకుంటాయి. ఇందుకోసం అమెరికా, భారత్ కలిసి క్రిటికల్ మినిరల్స్ సెక్యూరిటీ టాక్స్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
కాగా, టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశంలో ఐదు ప్రధాన రంగాలను గుర్తించారు. లిథియం శుద్ధి, బ్యాటరీల తయారీల్లో ఉపయోగించే కాథోడ్ పదార్ధాలు ఉత్పత్తి, బ్రాటరీ గ్రేడ్ సింథటిక్ గ్రాఫైట్ తయారీ, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్, మాగ్నెట్ తయారీ, ఖనిజాల రీసైక్లింగ్ ఉన్నాయి. ఈ రంగాల్లో సంయుక్త పెట్టుబడులు, సాంకేత భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ డీల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు : ఇజ్రాయెల్ మంత్రి