అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. కీలక విషయాలు ఇవే..!
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:42 PM
దాదాపు 107 రోజుల పాటు కొనసాగిన ఇరాన్-అమెరికా యుద్ధం దాదాపు తుది దశకు చేరుకుంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దాదాపు 107 రోజుల పాటు కొనసాగిన ఇరాన్-అమెరికా యుద్ధం దాదాపు తుది దశకు చేరుకుంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య అంగీకారానికి వచ్చిన ఒప్పందంలోని వివరాలను ఇరాన్ వార్తా సంస్థ మెహ్రా న్యూస్ వెల్లడించింది (US Iran peace deal).
శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత 60 రోజులపాటు ఇరు దేశాలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక ఆంక్షలు వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే ఇరాన్ 30 రోజుల్లో పూర్తిగా హోర్ముజ్ జలసంధిని తెరవాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని 30 రోజుల్లో తొలగించాలి (US Iran agreement 2026).

ఇక, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళిక సమర్పించాలి. ఇరాన్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అమెరికా దళాలను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి. అలాగే అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్లను విడుదల చేయాలి. చర్చల ప్రారంభానికి ముందే వీటిల్లో సగం విడుదల చేయాలి (Iran nuclear talks).
ఇక, లెబనాన్ సహా ఇరాన్ మిత్రపక్షాలపై తక్షణమే దాడులను నిలిపివేయాలి (Donald Trump Iran deal). ఇక, ఒప్పందం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తుది ఒప్పందాన్ని ఐరాస భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి.
ఇవి కూడా చదవండి..
ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..