బల్క్ క్యారియర్‌పై దాడి.. ఖతార్ సమీపంలో ఘటన..
ABN , Publish Date - May 10 , 2026 | 04:29 PM
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతార్‌కు సమీపంలోని ఓ బల్క్ క్యారియర్‌పై దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తీసుకొస్తున్న ఓ నౌకపై డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసినట్టు తెలుస్తోంది.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతార్‌కు సమీపంలోని ఓ బల్క్ క్యారియర్‌పై దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తీసుకొస్తున్న ఓ నౌకపై డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ దాడికి పాల్పడింది ఎవరనే విషయంలో స్పష్టత లేదు (Qatar vessel attack).
దోహాకు 21 నాటికల్ మైళ్ల దూరంలో సరుకును తరలిస్తున్న నౌకను డ్రోన్ లేదా క్షిపణి ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ నౌక ఏ దేశానికి చెందినది, ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తోంది అని విషయంపై సమాచారం లేదు (ship hit by projectile).
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది (Gulf maritime security). ఇరాన్ పోర్టులు, నౌకలపై దిగ్బంధనానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించింది. ఈ తరుణంలో పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన ఈ దాడి పలు ఉద్రిక్తతలకు కారణంగా మారింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..
విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..