Share News

పర్షియన్ గల్ఫ్‌లో దాడులు.. ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్..

ABN , Publish Date - Mar 12 , 2026 | 08:26 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది

పర్షియన్ గల్ఫ్‌లో దాడులు.. ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్..
Burning ship Persian Gulf video

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఆ జలసంధి గుండా వెళుతున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఆ జలసంధిలో అడుగడుగునా సీ మైన్స్‌ను ఏర్పాటు చేసింది (Oil tanker fire Persian Gulf).


తాజాగా పర్షియన్ గల్ఫ్‌లోని ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ పేల్చేసినట్టు టర్కీ ఆధ్వర్యంలోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 'పర్షియన్ గల్ఫ్‌లోని ఉమ్ ఖాసర్ ఓడరేవు దగ్గర దాడి తర్వాత, ఇరాక్‌లోని బాస్రా సమీపంలోని ప్రాదేశిక జలాల్లో విదేశీ చమురు ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది' అని ఆ మీడియా సంస్థ పేర్కొంది. మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Iran war tanker attack).


ఆ చమురు ట్యాంకర్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి (Persian Gulf video). కాగా, ఈ దాడికి తమదే బాధ్యత అని ఇరాన్ అంగీకరించింది. చమురు ట్యాంకర్లపై దాడి చేయడానికి ఇరాన్ నావికాదళ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కాగా, తాజా దాడిలో ఒకరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూాడా చదవండి..

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..


ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 12 , 2026 | 08:29 AM