Share News

ఇజ్రాయెల్ తొలి దాడులు.. ఖమేనీ కుమారుడు ముజ్తబాకు గాయాలు..

ABN , Publish Date - Mar 08 , 2026 | 08:51 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్‌పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్ తొలి దాడులు.. ఖమేనీ కుమారుడు ముజ్తబాకు గాయాలు..
Mojtaba Khamenei injured

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్‌పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ దాడుల్లో ఆయన కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖమేనీ గాయపడినట్టు సమాచారం.


ఆ దాడుల వల్ల ఖమేనీతో పాటు ఇరాన్‌కు చెందిన 40 మంది కీలక నాయకులు, సైనిక జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. అయితే మజ్తబా మాత్రం ప్రాణాలతో బయటపడ్డారట. దాడుల సమయంలో ముజ్తబా ఆ ప్రాంగణంలో ఉన్నారా, లేదా అనే విషయంపై క్లారటీ లేదు. అయితే ఆ దాడుల్లో మజ్తబా భార్య జహ్రా ప్రాణాలు కోల్పోయారు. కాగా, మజ్తబా గాయాల తీవ్రత గురించి ఎలాంటి సమాచారమూ లేదు. కాగా, తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యేందుకు మజ్తబా పావులు కదుపుతున్నారు.


ఇరాన్‌లోని శక్తివంతమైన ఐఆర్‌జీసీపై మజ్తబాకు పూర్తిగా పట్టు ఉంది. దీంతో ఖమేనీ స్థానాన్ని ముజ్తబా భర్తీ చేస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అదంత సులభం కాదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్‌ను నిర్ణయించే గార్డియన్ కౌన్సిల్‌లోని కొందరు సభ్యులు అధికారాన్ని మజ్తబాకు వారసత్వంగా ఇచ్చేందుకు ఇష్టపడడం లేదట. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మజ్తబాకు అధికారం అప్పగించేందుకు సుముఖంగా లేరు.


ఇవి కూడా చదవండి..

రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..


స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 08 , 2026 | 08:51 AM