Share News

యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి..

ABN , Publish Date - May 17 , 2026 | 07:51 PM

పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఒకవైపు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరగింది.

యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి..
UAE nuclear plant drone strike

పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఒకవైపు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరగింది. ఈ దాడి కారణంగా బరాకా అణువిద్యుత్ కేంద్రం జనరేటర్ వద్ద మంటలు చెలరేగాయి (UAE nuclear plant drone strike).


ఈ డ్రోన్ దాడి వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అబుదాబీ అధికారులు వెల్లడించారు. ఈ అణు విద్యుత్ కేంద్రంపై దాడి వల్ల ఎలాంటి రేడియేషన్ సమస్యా తలెత్తలేదని పేర్కొన్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎవరూ ప్రకటించుకోలేదు. యూఏఈపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్ ఈ దాడులకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి (Barakah nuclear plant fire).


మరోవైపు, గత రెండు రోజుల్లో లెబనాన్‌లోని 100కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది (Israel Lebanon attacks). హెజ్‌బొల్లా మౌలిక వసతులు, రాకెట్ లాంచ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు తెలిపింది. తాజా దాడుల్లో పౌరులు, వైద్య సిబ్బంది సహా పలువురు మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..


మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..

Updated Date - May 17 , 2026 | 07:51 PM