క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:35 PM
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ శాంతి సందేశాన్ని క్షిపణులపై అంటించి మరీ, వాటిని ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఓ వీడియోలో ఐఆర్‌జీసీ అధికారి ఒకరు క్షిపణిపై స్టిక్కర్లు అంటిస్తున్నట్టు కనబడుతోంది (Iran missiles).
ఇరాన్‌పై దాడి సమర్థనీయం కాదని, ఇది అమానవీయ చర్య అని, వెంటనే యుద్ధాన్ని ముగించాలని ఇటీవల స్పెయిన్ ప్రధాని సాంచెజ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను ప్రస్తావిస్తూ.. 'నిస్సందేహంగా, ఈ యుద్ధం చట్ట విరుద్ధం మాత్రమే కాదు.. అమానుషం కూడా. ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ' అని రాసి ఉన్న స్టిక్కర్‌ను క్షిపణిపై అంటించి ఇజ్రాయెల్ పైకి ప్రయోగించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Iran Israel conflict).
ఇరాన్ ఈ విధంగా ఇజ్రాయెల్‌కు సందేశాలు పంపడం ఇదే తొలిసారి కాదు (Middle East tensions). యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో కూడా ఇదే తరహాలో క్షిపణులపై యుద్ధ సందేశాలు రాసి ప్రయోగించింది. తాజాగా స్పెయిన్ ప్రధాని అభిప్రాయాలను ప్రస్తావిస్తూ క్షిపణులను ప్రయోగించింది.
ఈ వార్తలు కూడా చదవండి
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు