Share News

మాస్క్‌లు వేసుకుని.. భారత్ నౌకను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూడండి..

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:16 PM

పర్షియన్ గల్ఫ్‌లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మాస్క్‌లు వేసుకుని.. భారత్ నౌకను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూడండి..
Iran seizes Indian ship Hormuz

పర్షియన్ గల్ఫ్‌లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఇరాన్ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది (Iran seizes Indian ship Hormuz).


ముసుగులు ధరించిన కమాండోలు ఆ నౌకలను వెంబడించి, వాటిని ఎలా స్వాధీనం చేసుకున్నారో చూపిస్తున్న ఒక వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఆ వీడియో చూడడానికి ఓ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ ఘటనలో రెండు నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారతదేశంలోని గుజరాత్ వైపు ప్రయాణిస్తున్న నౌక అని వార్తలు వస్తున్నాయి. ఆ నౌకలు నిబంధనలను ఉల్లంఘించాయని, నావిగేషన్ సిస్టమ్‌లను మార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు (Iran navy commandos video).


పనామా జెండా ఉన్న 'ఎమ్‌ఎస్‌సీ ఫ్రాన్సెస్కా', లైబీరియా జెండా గల 'ఎపామినోండాస్' అనే రెండు నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంది. వాటిల్లో 'ఎపామినోండాస్' దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్తోంది. ఆ నౌకలను ఇరాన్ సైనికులు స్పీడ్‌బోట్ల ద్వారా చేరుకున్నారు. ముసుగులు ధరించి, తుపాకులు పట్టుకున్న కమాండోలు నౌకల పైకి ఎక్కారు. ఆ తర్వాత ఆ సైనికులు నౌక డెక్ మీదకు ఎక్కుతున్నట్టు కనిపిస్తోంది (India bound vessel seized Iran).


ఈ నౌకపై ఇరాన్ సైనికులు కాల్పులు జరిపారు. గ్రెనెడ్లు కూడా విసిరారు (Hormuz shipping crisis). ఈ దాడి వల్ల షిప్‌లోని బ్రిడ్జి (కేంద్ర కమాండ్ సెంటర్) దెబ్బతింది. సిబ్బంది మాత్రం క్షేమంగానే ఉన్నారు. కాగా, భారతదేశానికి వస్తున్న నౌకపై జరిగిన దాడి ఢిల్లీ, టెహ్రాన్‌ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. గత వారం కూడా భారత్ జెండా ఉన్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్


నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 23 , 2026 | 04:16 PM