Share News

ఇరాన్‌కు భారీ ప్రాణ నష్టం.. యుద్దంలో 3375 మంది ఇరానీయుల మృతి..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:24 PM

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది.

ఇరాన్‌కు భారీ ప్రాణ నష్టం.. యుద్దంలో 3375 మంది ఇరానీయుల మృతి..
Iran war death toll 3375

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దాదాపు నలభై రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 3375 మంది మరణించినట్టు ఇరాన్ తెలిపింది. వీరిలో 2875 మంది పురుషులు, 500 మంది మహిళలు ఉన్నట్టు ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ అబ్బాస్ మస్జేది అరానీ వెల్లడించారు (Iran war death toll 3375).


అమెరికాతో శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు లెబనాన్‌లో కూడా మృతుల సంఖ్య భారీగానే ఉంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 2 వేల మంది మరణించినట్టు సమాచారం. ఇటీవల ఒక్కరోజులోనే 300 మంది లెబనాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు (US Israel Iran conflict).


కాగా, శాంతి చర్చల విషయంలో అమెరికా తమ నమ్మకాన్ని పొందలేకపోయిందని ఇరాన్ ప్రకటించింది (Pakistan talks collapse Iran US). యుద్ధంలో సాధించలేకపోయిన డిమాండ్లను శాంతి చర్చల సమయంలో అమెరికా తమ ముందు ఉంచిందని ఇరాన్ నాయకులు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..


ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..

Updated Date - Apr 12 , 2026 | 08:37 PM