Share News

మధ్యవర్తిత్వానికి రష్యా సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు పుతిన్ ఆఫర్..

ABN , Publish Date - Apr 12 , 2026 | 07:38 PM

పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇస్లామాబాద్‌లో సుమారు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు.

మధ్యవర్తిత్వానికి రష్యా సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు పుతిన్ ఆఫర్..
Russia mediation Iran US

పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇస్లామాబాద్‌లో సుమారు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. ఈ నేపథ్యంలో రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్ధమని ప్రకటించింది (Russia mediation Iran US).


ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి శాంతి ప్రయత్నాలకు సహాయం చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు పుతిన్ చెప్పినట్టు క్రెమ్లిన్ తెలిపింది. 'పశ్చిమాసియాలో సంఘర్షణకు రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారం కనుగొనడానికి, పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని సాధించే ప్రయత్నాలకు మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్లాదిమిర్ పుతిన్ నొక్కి చెప్పారు' అని క్రెమ్లిన్ పేర్కొంది (Putin mediation Middle East).


కాగా, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి (US Iran conflict news). 'చర్చలలో పురోగతిని సాధించలేకపోవడం, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి సుస్థిరమైన ముగింపు లభించకపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది' అని యూకే ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ అన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇస్లామాబాద్ చర్చలు ఒప్పందం లేకుండా ముగియడం నిరాశపరిచిందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..


ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..

Updated Date - Apr 12 , 2026 | 08:22 PM