అందమైన అమ్మాయి, బిలియన్ డాలర్లు కావాలి.. తుర్కియేకు ఉగాండా సైనికాధిపతి డిమాండ్..
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:02 PM
ఆఫ్రికా దేశమైన ఉగాండా సైనికాధిపతి జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా చేస్తున్న సహాయానికి గానూ ఒక బిలియన్ డాలర్లను, ఒక అందమైన అమ్మాయిని అప్పగించాలని తుర్కియేకు ఆయన హుకుం జారీ చేశారు.
ఆఫ్రికా దేశమైన ఉగాండా సైనికాధిపతి జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా చేస్తున్న సహాయానికి గానూ ఒక బిలియన్ డాలర్లను, ఒక అందమైన అమ్మాయిని అప్పగించాలని తుర్కియేకు ఆయన హుకుం జారీ చేశారు. తుర్కియేలోని అత్యంత అందమైన అమ్మాయిని అప్పగిస్తే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు. 30 రోజుల్లోగా తన డిమాండ్లను నెరవేర్చాలన్నారు (Muhoozi Kainerugaba Turkey demand).
సోమాలియాలో భద్రతా చర్యల్లో ఉగాండా కీలక పాత్ర పోషించిందని, కానీ ఆర్థికంగా తుర్కియే లాభపడుతోందని కైనెరుగాబా అన్నారు. 30 రోజుల్లోగా తన డిమాండ్లను నెరవేర్చకపోతే దౌత్య పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తుర్కియేను హెచ్చరించారు. ఉగాండాలోని తుర్కియే దేశ కార్యాలయాన్ని కూడా మూసేస్తామని వెల్లడించారు. తమ గగనతలంలోకి తుర్కియే విమానాలకు ప్రవేశం ఉండదన్నారు. అలాగే ఇజ్రాయెల్‌కు సహాయంగా లక్ష మంది సైనికులను పంపిస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది (Uganda army chief controversy).
కైనెరుగాబా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు (Most beautiful woman comment). 2022లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని ఉద్దేశించి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జార్జియా మెలోనిని పెళ్లి చేసుకోవాలని ఉందని బహిరంగంగా ప్రకటించారు. అమెను తనకు అప్పగిస్తే.. అందుకు బదులుగా ప్రపంచంలోనే అత్యంత అందమైన ఆవులుగా పేరు పొందిన 100 అంకోలే జాతి ఆవులను ఇస్తానని ప్రకటించారు. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో కైనెరుగాబా తండ్రి, ఉగాండా అధ్యక్షుడు అయిన యోవేరి ముసెవెని క్షమాపణలు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..
ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..