Share News

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం.. అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడులు..

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:01 PM

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక 'అబ్రహం లింకన్‌'పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది.

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం.. అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడులు..
USS Abraham Lincoln

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక 'అబ్రహం లింకన్‌'పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అబ్రహం లింకన్' కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించిన గంటలోపే ఇరాన్ దాడులకు పాల్పడడం గమనార్హం (USS Abraham Lincoln).


ప్రతిష్టాత్మక విమాన వాహక నౌక అయిన 'అబ్రహం లింకన్‌'పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఇరాన్‌తో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. నెల రోజుల కాల్పుల విరమణకు సంబంధించి 15 షరతులతో కూడిన ప్రణాళికను ఇరాన్‌కు పాకిస్థాన్ ద్వారా అందించారు. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్ దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది (Iran missile attack).


కాగా, కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఖారీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు (Iran US war). 'ప్రపంచంలో స్వయం ప్రకటిత అగ్ర రాజ్యమైన అమెరికా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తప్పించుకోగలిగి ఉంటే.. ఇప్పటికే తప్పించుకుని ఉండేది. మీ ఓటమిని ఒక ఒప్పందంగా చూపించవద్దు' అని అమెరికాను కవ్వించే వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..


పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి

Updated Date - Mar 25 , 2026 | 07:04 PM