Share News

50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు.. ఇరాన్‌ యుద్ధం పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తోందంటే..

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:16 PM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.

50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు.. ఇరాన్‌ యుద్ధం పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తోందంటే..
US Iran war CO2 emissions

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు, బాంబులతో దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి (US Iran war CO2 emissions).


యుద్దం మొదలైన మొదటి రెండు వారాల్లో 50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలైనట్టు 'క్లైమేట్ అండ్ కమ్యూనిటీ' ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ ఉద్గారాల వల్ల పర్యావరణానికి 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. భవనాల ధ్వంసంతో 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడులతో 18 లక్షల టన్నుల ఉద్గారాలు విడుదలైనట్టు తెలిపింది. ఈ 14 రోజుల్లో విడుదలైన విష వాయువులు, ఓ దీవి ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్య ఉద్గారాల కంటే ఎక్కువని తెలిపింది (5 billion kg CO2 Iran war).


హోర్ముజ్‌లోని చమురు ట్యాంకర్లపై జరిగిన, జరుగుతున్న దాడుల వల్ల సముద్ర జలాలు కూడా విషపూరితమవుతాయని (Climate impact of war), అందువల్ల జలచరాలు కూడా భారీ స్థాయిలో చనిపోతాయని 'క్లైమేట్ అండ్ కమ్యూనిటీ' ఇన్‌స్టిట్యూట్ తేల్చి చెప్పింది. ఈ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదల కావడంతో యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో భారీ ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..


ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..

Updated Date - Mar 22 , 2026 | 06:34 PM