యూఏఈలో ట్రక్కు బీభత్సం
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:58 AM
యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
23 వాహనాలు ఢీ.. 14 మంది మృతి
మృతుల్లో పలువురు భారతీయులు
దుబాయ్, నవంబరు 13: యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫుజైరా ఎమిరేట్‌లో ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన అత్యంత ఘోరమైన ఈ రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని భారత కాన్సులేట్ వెల్లడించింది. ఫుజైరా ఎమిరేట్ ముఖద్వారం వద్ద షేక్ ఖలీఫా బిన్ జియాద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఓ ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోగా.. ఆ వావానం అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొట్టి బోల్తా పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ఐదు ట్రక్కుల సహా 23 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ట్రక్కులో మంటలు చెలరేగి ఇతర వాహనాలకు వ్యాపించడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగిందని వెల్లడించారు. మృతుల వివరాలు సేకరించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తున్నారు.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి