ఇరాన్‌పై మరోసారి దాడులు చేస్తాం: ట్రంప్
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:08 AM
ఇరాన్‌పై మరో విడత సైనిక దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
న్యూఢిల్లీ/వాషింగ్టన్, అక్టోబరు 24: ఇరాన్‌పై మరో విడత సైనిక దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో ఒప్పందానికి ముందుకు రాకపోతే ఇరాన్‌పై చిన్నపాటి ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ చేపడతామని హెచ్చరించారు. అయితే, ఈ లోపే ఇరాన్ ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ‘‘ఒప్పందం రూపంలో లేదంటే మరో మార్గంలోనో ఈ యుద్ధం ముగుస్తుంది’’ అని చెప్పారు. అయితే, నిప్పుతో చెలగాటమాడొద్దని అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. తమపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడికి దిగితే గల్ఫ్ ప్రాంతంలో సముద్రగర్భ సమాచార కేబుళ్ల నుంచి సైనిక స్థావరాల వరకు వేటినీ విడిచిపెట్టబోమని ఇరాన్‌కు చెందిన ఓ సైనిక అధికారి హెచ్చరించారు. మరోవైపు, పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలోని వివిధ దేశాల నుంచి అమెరికా తన రాయబారులు, వారి కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఇరాన్ ప్రణాళికలు రచించిందని, కొన్ని ఇప్పటికే అమలు దశకు చేరాయన్న నిఘా వర్గాల సమాచారంతో విదేశాంగ శాఖ అప్రమత్తమైంది.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష