నాటో నుంచి అమెరికా వైదొలగనుందా? కీలక భేటీలో తేలిన అంశాలేంటి?
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:22 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. నాటో కూటమి నుంచి వైదొలగుతామని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఈ భేటీలో తేలిందేంటి?
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ యుద్ధం, నాటో దేశాల సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, నాటో సభ్య దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ ఇంతకు ముందే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో నాటో దేశాలు వెనకడుగు వేయడంపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నాటోను ఒక 'పేపర్ టైగర్' గా అభివర్ణించిన ట్రంప్, అమెరికా ఈ కూటమి నుంచి బయటకు రావాలని ఆలోచిస్తున్నట్లు ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, నాటో చీఫ్ మార్క్ రుట్టేను ఐరోపాలో 'ట్రంప్ విష్పరర్'.. (ట్రంప్‌ను ఒప్పించగల వ్యక్తి) గా పిలుస్తారు. ఈ సమావేశంలో రుట్టే ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఐరోపా దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నాయని ట్రంప్‌కు వివరించడం. ఇంధన ధరల అంశం, సముద్ర వ్యాపారాన్ని చక్కదిద్దే విషయంలో అమెరికాతో కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వడం. నాటోపై ట్రంప్ చేస్తున్న విమర్శలను తగ్గించి, కూటమి ఐక్యతను కాపాడటం.. దీనిలోని ప్రధాన అంశాలు. ఈ భేటీతో ట్రంప్ కాస్త మెత్తబడే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఒకవేళ ట్రంప్ నాటో నుంచి అమెరికాను విడదీయాలని భావించినా, అది అంత సులభం కాదు. 2023లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం, ఏ అధ్యక్షుడైనా నాటో నుంచి వైదొలగాలంటే సెనేట్‌లో రెండొంతుల మెజారిటీ లేదా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News