Share News

నేను ముందే చెప్పాను..విన్నారా?!

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:22 AM

మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిస్తే స్టాక్‌ మార్కెట్ల భారీ పతనం తప్పదని ముందే ఓటర్లను హెచ్చరించానని, అదే జరిగిందని... అలాగే ఇరాన్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా హెచ్చరించానని... అది కూడా నిజమైందని ట్రంప్‌ పేర్కొన్నారు

నేను ముందే చెప్పాను..విన్నారా?!
trump

  • డెమోక్రాట్లు గెలిస్తే మార్కెట్‌ పతనం తప్పదన్నాను

  • ఇరాన్‌ దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పాను

  • జరిగిందా... లేదా?.. ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌

వాషింగ్టన్‌, నవంబరు 23: మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిస్తే స్టాక్‌ మార్కెట్ల భారీ పతనం తప్పదని ముందే ఓటర్లను హెచ్చరించానని, అదే జరిగిందని... అలాగే ఇరాన్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా హెచ్చరించానని... అది కూడా నిజమైందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఏడాదికి పైగా ఎప్పుడూ ప్రయోగించనన్ని డ్రోన్లు, క్షిపణులను కేవలం ఒక్క గత వారం రోజుల్లోనే ఇరాన్‌ ప్రయోగించడమే దీనికి నిదర్శనమని తెలిపారు. అయితే వాటన్నిటిని నిర్వీర్యం చేయడంతో ఎటువంటి నష్టం వాటిల్ల లేదన్నారు. ఇరాన్‌ నేతలు డెమొక్రాట్లను బలహీనులు, అసమర్థులు, స్వదేశాన్ని నాశనం చేసేవారని భావిస్తున్నారని... అయితే తాను అలా జరగనివ్వనని స్పష్టం చేశారు. డెమొక్రాట్లు, ఇరాన్‌.. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగేలా చూశారని...ఎన్నికలు ముగిశాక రికార్డు స్థాయిలో క్రూడాయిల్‌ ధరలు పడిపోవడమే దీనికి నిదర్శనమని ట్రంప్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు.

Updated Date - Nov 24 , 2026 | 04:22 AM