Share News

ఎలాన్ మస్క్‌ను కూడా నేనే కాపాడా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:20 PM

ప్రపంచ కుభేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను గతంలో తాను ఓ పెద్ద సమస్య నుంచి కాపాడనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

ఎలాన్ మస్క్‌ను కూడా నేనే కాపాడా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Elon Musk, Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుభేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను గతంలో తాను ఓ పెద్ద సమస్య నుంచి కాపాడనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తొలి పదవీకాలంలో మస్క్ పెద్ద సమస్యలో చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయనకు అండగా నిలిచానని చెప్పారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఎన్విడియా అధ్యక్షుడు జెన్సన్ హువాంగ్ క్లిష్ట సమస్యను ఎదుర్కొన్నప్పుడు కూడా ట్రంప్ జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే (Trump saves Elon Musk).


తాజాగా జెన్సన్ హువాంగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తన తొలి పదవీకాలంలో మస్క్‌కు ఎంతో సహాయం చేశానని, అప్పట్లో ఆయన పెద్ద సమస్యలో ఉన్నారని చెప్పారు. తాను అండగా నిలవకపోతే ఈరోజు మనకు ఎలాన్ మస్క్ ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు. మస్క్‌ అద్భుతమైన మేధావి అని ప్రశంసించారు. అయితే ఆయనలో 80 శాతం సూపర్ జీనియస్ లక్షణాలు ఉంటే, మరో 20 శాతం ఇతర సమస్యలు ఉన్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఎదుర్కొన్న సమస్య గురించి కొందరు ఊహాగానాలు ప్రారంభించారు (Trump Elon Musk News).


2020 మేలో కాలిఫోర్నియాలో కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో టెస్లా తన ఫ్రీమాంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది (Tesla Factory Reopening). స్థానిక కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని తెరవడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో తనను అరెస్ట్ చేసుకోండని అధికారులను మస్క్ సవాల్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్.. టెస్లా ఫ్యాక్టరీని వెంటనే తిరిగి ప్రారంభించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం అనుమతించాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ట్రంప్‌నకు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ట్రంప్ దీని గురించే ప్రస్తావించి ఉంటారని చాలా మంది ఊహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 07:20 PM