బీజింగ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్..
ABN , Publish Date - May 13 , 2026 | 08:19 PM
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌కు చేరుకున్నారు. చివరిసారి 2017లో ట్రంప్ చైనా వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరాన్ యుద్ధం, చైనాతో ట్రేడ్ వార్, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌కు చేరుకున్నారు. చివరిసారి 2017లో ట్రంప్ చైనా వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరాన్ యుద్ధం, చైనాతో ట్రేడ్ వార్, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయా విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ట్రంప్ చర్చించనున్నట్టు సమాచారం (Trump China visit 2026).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా చైనా చేరుకున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ట్రంప్‌తో పాటు చైనా వెళ్లారు. తాను కూడా బీజింగ్ చేరుకున్నట్టు మస్క్ ట్వీట్ చేశారు. అమెరికా అధికారులతో పాటు యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఎన్‌విడియాకు చెందిన జెన్సన్ హువాంగ్ వంటి అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా చైనాకు వెళ్లినట్టు సమాచారం (Xi Jinping Trump meeting).
చైనాతో అమెరికా టెక్‌కు సంబంధించి పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి (US China talks). ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం కూడా ఈ సమావేశానికి ప్రధాన అజెండాగా మారింది. చైనా ప్రభావంతో ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్‌నకు ఘన స్వాగతం లభించింది. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, ట్రంప్‌నకు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు
ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..