Share News

టైటానిక్ ప్రమాదంలో ఓ వ్యక్తిని కాపాడిన లైఫ్ జాకెట్.. వేలంలో ఎంత పలికిందంటే..

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:29 AM

ప్రపంచాన్ని కుదిపేసిన టైటానిక్ ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ అరుదైన వస్తువు వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి ధరించిన లైఫ్ జాకెట్‌కు సుమారు రూ.9 కోట్ల ధర పలికింది.

టైటానిక్ ప్రమాదంలో ఓ వ్యక్తిని కాపాడిన లైఫ్ జాకెట్.. వేలంలో ఎంత పలికిందంటే..
Titanic life jacket auction

ప్రపంచాన్ని కుదిపేసిన టైటానిక్ ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ అరుదైన వస్తువు వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి ధరించిన లైఫ్ జాకెట్‌కు సుమారు రూ.9 కోట్ల ధర పలికింది. ప్రమాదానికి గురైన ఆ ఓడలోని ఫస్ట్-క్లాస్ ప్రయాణికురాలైన లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి ఈ లైఫ్ జాకెట్‌ ధరించడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు (Titanic life jacket auction).


ఆ లైఫ్‌జాకెట్‌పై ఫ్రాంకటెల్లీతో పాటు అదే లైఫ్‌బోట్‌లో ప్రాణాలతో బయటపడిన వారి సంతకాలు కూడా ఉన్నాయి. పశ్చిమ ఇంగ్లండ్‌లోని డెవిజెస్‌లో హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ వేలం నిర్వాహకులు ఈ అమ్మకాన్ని నిర్వహించారు. ఈ లైఫ్ జాకెట్‌ను 6.7 లక్షల పౌండ్లకు (సుమారు రూ.8–9 కోట్లు) ఒక గుర్తుతెలియని వ్యక్తి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లైఫ్ జాకెట్ ప్రత్యేకత ఏమిటంటే.. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి ధరించిన లైఫ్ జాకెట్‌గా వేలంలోకి వచ్చిన ఏకైక వస్తువు ఇదే (Titanic survivor item sale).


కాగా, ఇదే వేలంలో టైటానిక్ లైఫ్‌బోట్‌కు చెందిన సీటు కుషన్ కూడా భారీ ధరకు అమ్ముడైంది (UK auction Titanic). ఈ రికార్డు స్థాయి ధరలు టైటానిక్ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎంత ఆసక్తి ఉందో చూపిస్తున్నాయి. టైటానిక్ నౌక లండన్ నుంచి న్యూయార్క్ వెళుతూ 1912లో ఓ మంచుకొండను ఢీకొని మునిగిపోవడంతో సుమారు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 మంది ప్రాణాలతో బయటపడ్డారు.


ఇవి కూడా చదవండి..

దక్షిణాదికి ముందుంది ముప్పు!

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 19 , 2026 | 11:29 AM