ఏఐ టూల్స్ మీద ఉద్యోగుల ఖర్చుపై టెస్లా ఆంక్షలు
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:13 AM
ఏఐ టూల్స్ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ...
వాషింగ్టన్, జూలై 6: ఏఐ టూల్స్ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఏఐ మీద పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునే క్రమంలో టెస్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతున్న మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగుల్లో 4,800 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది కంపెనీ షేర్ల ధరలు 23ు పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News