Share News

కోపైలట్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెర్రరిస్టుల ఫొటో

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:04 PM

భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హల్ హమామీ పేరుతో లింక్డ్‌ఇన్‌లో ఉన్న ప్రొఫైల్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అతని పేరుతో ఉన్న ఫ్రొఫైల్‌లో టెర్రరిస్టుల ఫొటో ఉన్నట్లు ఓ వార్తా సంస్థ కథనం వెలువరించింది. అయితే, మచ్చార్‌పై దాడి జరిగిన 9 గంటల తర్వాత హమామీ ప్రొఫైల్ డిలీట్ అయిందని ఆ కథనం తెలిపింది.

కోపైలట్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో టెర్రరిస్టుల ఫొటో

ఇంటర్‌నెట్ డెస్క్: భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హల్ హమామీ పేరుతో లింక్డ్‌ఇన్‌లో ఉన్న ప్రొఫైల్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అతని పేరుతో ఉన్న ఫ్రొఫైల్‌లో టెర్రరిస్టుల ఫొటో ఉన్నట్లు ఓ వార్తా సంస్థ కథనం వెలువరించింది. అయితే, మచ్చార్‌పై దాడి జరిగిన 9 గంటల తర్వాత హమామీ ప్రొఫైల్ డిలీట్ అయిందని ఆ కథనం తెలిపింది.


హమామ్ అల్ హమామీ పేరుతో లింక్డ్ ఇన్‌లో ఉన్న ప్రొఫైల్‌లో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్ ఈఎల్ ఏఎల్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానంలోని కాక్‌పిట్, ఆ విమానాన్ని జూమ్ చేస్తున్న ద‌ృశ్యాలు ఆ క్లిప్‌లో కనిపించాయి. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత అల్ కాయిదాను నడిపించిన అమైన్ అల్ జవహరి ఫొటోతో పాటు అమెరికాలో 2009లో ఆత్మాహుతి దాడిచేసి 9 మందిని చంపిన హుమామ్ ఖలీల్ అబూ ములాల్ అల్ బలావీ ఫొటో కూడా ఆ క్లిప్‌లో కనిపించింది.


మరో పోస్టులో ప్రార్థనా స్థలాలు

ఏఐ జనరేట్ చేసినట్లు భావిస్తున్న మరో ఎక్స్ పోస్టులో మక్కా, మదీనా, జెరుసలెం ఫొటోలు కనిపించాయి. అంతేకాకుండా ఒక పద్యం కూడా అందులో ఉంది. అవమానాన్ని తిరస్కరించడం, చావుకు భయపడకపోవడం, గౌరవాన్ని కాపాడుకోవడం వంటివి చేయాలని ఆ ఫొటో వెనుక రాసి ఉంది. అయితే, ఆ ప్రొఫైల్ ఎవరిదో అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. హమామీ పేరుతో ఎవరైనా ఆ ప్రొఫైల్‌ను తయారుచేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. అలాగే, మహిళలను హమామీ ద్వేషించినట్లు కూడా ఎక్స్‌లో రెండు పోస్టులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వాటిని డిలీట్ చేశారు. అందులో ఒక పోస్టులో పురుషులు, మహిళలు కలిసి పనిచేసే సంస్కృతిని హమామీ వ్యతిరేకించినట్లు ఉంది.


ఇవీ చదవండి:

పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

Updated Date - Oct 03 , 2026 | 01:32 PM