Share News

2సార్లు విషం ఇంజెక్షన్లు ఇచ్చినా.. ప్రాణం పోలే!

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:06 AM

అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో.. మరణశిక్ష పడ్డ క్రిస్టా పైక్‌ (50) అనే మహిళకు ఆ శిక్ష అమలులో భాగంగా రెండుసార్లు ప్రాణాంతక (పెంటోబార్బిటాల్‌) ఇంజెక్షన్‌ ఇచ్చినా ఆమె చనిపోలేదు.

2సార్లు విషం ఇంజెక్షన్లు ఇచ్చినా.. ప్రాణం పోలే!
injection

america.jpg

  • అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో మహిళా ఖైదీకి మరణశిక్ష

  • ఇంజెక్షన్‌ విఫలమవడంతో శిక్ష అమలు తాత్కాలికంగా నిలిపివేత

నాష్‌విల్లే, అక్టోబరు 1: అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో.. మరణశిక్ష పడ్డ క్రిస్టా పైక్‌ (50) అనే మహిళకు ఆ శిక్ష అమలులో భాగంగా రెండుసార్లు ప్రాణాంతక (పెంటోబార్బిటాల్‌) ఇంజెక్షన్‌ ఇచ్చినా ఆమె చనిపోలేదు. దీంతో ఆమె శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాలిచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది డిసెంబరులో గ్యారీ సట్టన్‌ అనే ఖైదీకి విధించాల్సిన మరణ శిక్షను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా క్రిస్టాపైక్‌ మరణించకపోవడానికి కారణాలపై స్వతంత్ర విచారణకు ఆదేశాలిచ్చారు. 1996లో కొలీన్‌ స్లెమ్మర్‌ అనే 19 ఏళ్ల యువతిని చిత్రహింసలు పెట్టి చంపేసిన కేసులో క్రిస్టా పైక్‌కు మరణశిక్ష పడింది. గడిచిన 200 ఏళ్లలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష పడడం ఇదే మొదటిసారి. కాగా.. ఈ ఏడాది మే నెలలో టెన్నెసీ రాష్ట్రంలోనే టోనీ కరూథర్స్‌ అనే ఖైదీకి మరణశిక్ష అమలులో భాగంగా పెంటోబార్బిటాల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉండగా.. నరం దొరక్కపోవడంతో శిక్షను ఏడాదిపాటు వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

మచ్చార్‌పై గొడ్డలితో దాడి.. అసలు విమానంలో గొడ్డలి ఎందుకు ఉంది?

ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదం.. ప్రయాణికులను కాపాడిన హీరోలు వీరే..

Updated Date - Oct 02 , 2026 | 02:08 AM