Share News

గత నెల సౌదీలో హూతీల దాడిలో గాయపడ్డ తెలంగాణ వాసి మృతి

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:48 AM

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై గతనెలలో హూతీలు జరిపిన దాడిలో... తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం భారత ఎంబసీ ప్రకటించింది

గత నెల సౌదీలో హూతీల దాడిలో   గాయపడ్డ తెలంగాణ వాసి మృతి
embassy

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై గతనెలలో హూతీలు జరిపిన దాడిలో... తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం భారత ఎంబసీ ప్రకటించింది. కామారెడ్డిలోని సైలానిబాబా కాలనీకి చెందిన షేక్‌ సయీద్‌ (40) అక్టోబరు 10న రియాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రఖ్యాత కాఫీ షాపులో పని చేస్తుండగా హూతీలు చేసిన దాడులలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. రియాద్‌ నగరంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మృతుడి ఇద్దరు సోదరులు కూడా సౌదీలోనే పని చేస్తున్నారు. సయీద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేయడంతో భారత్‌ నుంచి మృతుడి కుటుంబ సభ్యులు రాలేకపోయారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..

Updated Date - Nov 05 , 2026 | 06:49 AM