సౌదీ అరేబియా ప్రతీకార దాడులు.. జెడ్డా పోర్టుపై హూతీల గురి..
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:54 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య పరస్పర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని హూతీ స్థావరాలపై సైనిక చర్యలు చేపట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య పరస్పర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని హూతీ స్థావరాలపై సైనిక చర్యలు చేపట్టాయి. మరోవైపు యెమెన్‌లోని రాస్ ఇసా నౌకాశ్రయంపై సౌదీ దాడి చేసిందని ఆరోపిస్తూ.. జెడ్డా సహా ఎర్ర సముద్ర తీరంలోని సౌదీ నౌకాశ్రయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హూతీలు హెచ్చరించారు. దీంతో అంతర్జాతీయ నౌకా రవాణా, చమురు సరఫరాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి (Saudi Arabia Yemen Conflict).
యెమెన్‌లోని హూతీల ఆధీనంలో ఉన్న కీలక రాస్ ఇసా నౌకాశ్రయాన్ని ఖాళీ చేయాలని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. సమీపంలోని ప్రజల వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి తుర్కీ అల్ మాలికీ సోషల్ మీడియా వేదికగా సూచించారు. ఈ హెచ్చరిక వెలువడిన కొద్దిసేపటికే సౌదీ అరేబియా.. రాస్ ఇసా పోర్టుపై దాడి చేసిందని హూతీలకు చెందిన అల్ మసీరా టెలివిజన్ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నౌకాశ్రయంతో పాటు ఎర్ర సముద్ర తీరంలోని ఇతర సౌదీ నౌకాశ్రయాలన్నింటిని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది (Saudi Airstrikes Yemen).
సౌదీ అరేబియా పోర్టుల పరిసరాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, పౌరులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు (Jeddah Port Attack). నౌకాయాన సంస్థలు కూడా తమ నౌకలను సౌదీ నౌకాశ్రయాల నుంచి తరలించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాలు ప్రకటించాయి. యెమెన్‌లోని ఉత్తర సాదా ప్రావిన్స్‌లో ఉన్న క్షిపణి ప్రయోగ వేదికను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..
భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..