అణ్వాయుధాల తయారీకి సౌదీ సిద్ధమవుతోందా.. అమెరికా రహస్య నివేదికలో కీలక అంశాలు..
ABN , Publish Date - Sep 26 , 2026 | 10:55 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియా అణు కార్యక్రమంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియా అణు కార్యక్రమంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో సౌదీ అరేబియా అణ్వాయుధాలను అభివృద్ధి చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేసినట్లు 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. అమెరికా కాంగ్రెస్‌కు అందించిన రహస్య పత్రాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సదరు పత్రిక తెలిపింది (Saudi Arabia nuclear weapons).
సౌదీ తన అణు కార్యక్రమాన్ని కేవలం విద్యుత్ ఉత్పత్తి వంటి శాంతియుత అవసరాలకే పరిమితం చేస్తుందా? లేదా భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీ దిశగా వెళ్లే అవకాశం ఉందా? అనే అంశాలపై అమెరికాలో చర్చ జరుగుతోంది. పౌర అవసరాల కోసం సౌదీకి యురేనియం ఇచ్చేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల కాలానికి ఇటీవల అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు (US intelligence Saudi Arabia).
యురేనియంను శుద్ధి చేసే సాంకేతికతను సౌదీ అరేబియాకు అందిస్తే, భవిష్యత్తుల్లో ఆ దేశం అణ్వాయుధాల తయారీ దిశగా వెళ్లే అవకాశముందని అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు (Saudi nuclear programme). అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఈ ఒప్పందాన్ని సమర్థించింది. సౌదీ అరేబియా అణ్వాయుధ కార్యక్రమానికి అమెరికా మద్దతు ఇవ్వదని స్పష్టం చేసింది. పౌర అణుశక్తి రంగంలో సహకారాన్ని పెంచుతూనే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి అవసరమైన రక్షణ చర్యలు ఉంటాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..