ఆర్థిక సంక్షోభం అంచున భారత్
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:57 AM
భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచున ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు.
అమెరికాలోని కొలంబియా వర్సిటీలో రాహుల్
న్యూయార్క్, నవంబరు 18: భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచున ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయి యువత తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. గత పదేళ్లలో ఉపాధికి వెన్నెముకలాంటి చిన్నతరహా పరిశ్రమల రంగం కుదేలైందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం (స్థానిక కాలమానం) కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహులగాంధీ మాట్లాడు తూ.. గత పదేళ్లలో బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శించారు. దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వంలోని కొందరు అధికారులే తమకు ఆ ఆధారాలు ఇచ్చారని తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచమంతా భారత ఆర్థిక ప్రగతిని పొగుడుతుంటే.. రాహుల్‌గాంధీ విదేశీ గడ్డపై నుంచి దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడింది.
ఇవి కూడా చదవండి..
బరాక్ క్షిపణుల ఆధునికీకరణకు ఇజ్రాయెల్‌తో భారత్ కీలక ఒప్పందం
పంజాబ్ రైతుకు జాక్‌పాట్.. రూ.500 పెట్టి టికెట్ కొంటే రూ.12 కోట్ల లాటరీ..