Share News

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..

ABN , Publish Date - May 20 , 2026 | 01:51 PM

భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ రానున్నట్టు ఇప్పటికే రష్యా ధ్రువీకరించింది.

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..
Putin Xi to attent BRICS Summit

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌ 12,13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశాలకు పుతిన్ హాజరవుతారని దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ధ్రువీకరించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. జిన్‌పింగ్‌ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, చైనా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. జిన్‌పింగ్ భారత పర్యటనపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.


2019లో జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఆ తరువాత 2020లో గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలు, 2022లో తవాంగ్ బోర్డర్ వద్ద ఉద్రికత్తల కారణంగా కొంతకాలం పాటు పరిస్థితులు గంభీరంగా మారాయి. ఆ తరువాత రష్యాలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిక్స్ కూటమిలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయన్న వార్తల నడుమ తాజా సమవేశాలకు రష్యా, చైనా అధినేతలు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రులు, ప్రతినిధుల సమావేశంలో భేదాభిప్రాయాల కారణంగా దేశాల సంయుక్త ప్రకటన ఏదీ వెలువడలేదు.


ఈ వార్తలనూ చదవండి:

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

Updated Date - May 20 , 2026 | 01:57 PM