Share News

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ABN , Publish Date - May 20 , 2026 | 12:58 PM

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన మెలోడీ టాఫీ గిఫ్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో
PM Modi's Melody Toffe Gift to Italy PM

ఇంటర్నెట్ డెస్క్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని మోదీల ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవసం లేదు. ఈ స్నేహానికి నెటిజన్లు మెలోడీ అనే పేరును మూడేళ్ల క్రితమే ఖరారు చేశారు. ఇరు దేశాధినేతల సమావేశం జరిగిన ప్రతిసారీ ఈ హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌లోకి వస్తుంటుంది. అయితే, తాజాగా ప్రధాని మోదీ స్వయంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను గుర్తుచేస్తూ ఇటలీ ప్రధానికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


తాజా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి పార్లీజీ మెలోడీ టాఫీల ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. మెలోడీ హ్యాష్ ట్యాగ్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ గిఫ్ట్‌పై ఇటలీ ప్రధాని స్పందిస్తూ థాంక్యూ చెప్పారు. తమ ఫ్రెండ్‌షిప్‌కు చిహ్నంగా ఉన్న మెలొడీ ప్యాకెట్‌ను పట్టుకుని ఇరు దేశాధినేతలు చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


2023 నుంచీ ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇరు దేశాధినేతల ఇంటి పేర్ల కలుపుతూ జనాలు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. 2023లో దుబాయ్‌లో జరిగిన కాప్ 28 సమావేశాల సందర్భంగా మెలోడీ తొలిసారిగా తెరపైకి వచ్చింది. ఈ సమావేశాల్లో గుడ్ ఫ్రెండ్స్ అంటూ మెలోడీ హ్యాష్‌ట్యాగ్‌ను అప్పట్లో ఇటలీ ప్రధాని షేర్ చేశారు. ఇక నాటి నుంచీ ఈ హ్యాష్‌ట్యాగ్ నిత్యం ట్రెండింగ్‌లోకి రావడంతో పాటు పలు ఓ రేంజ్‌లో మీమ్స్‌పుట్టుకొచ్చేలా చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

ఇరాన్‌ యుద్ధంతో ఆగ్రహం.. ట్రంప్‌నకు హ్యాండిచ్చిన సొంత పార్టీ సెనేటర్లు

Updated Date - May 20 , 2026 | 01:27 PM