Share News

ఇరాన్‌ దాడులలో ప్రకాశం జిల్లా వాసికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:28 AM

సౌదీ అరేబియాలోని ఓ చమురు కర్మాగారంపై ఇటీవల ఇరాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పోతరాజుపేటకు చెందిన షేక్‌ జావిద్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ఇరాన్‌ దాడులలో ప్రకాశం జిల్లా వాసికి తీవ్రగాయాలు

  • కాలు తొలగింపుతో శాశ్వత అంగవైకల్యం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): సౌదీ అరేబియాలోని ఓ చమురు కర్మాగారంపై ఇటీవల ఇరాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పోతరాజుపేటకు చెందిన షేక్‌ జావిద్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పినప్పటికీ ఒక కాలును పూర్తిగా తొలగించారు. సౌదీ అరేబియాలో చమురు సంస్థలకు ఇంజినీరింగ్‌ సేవలందిస్తున్న ఒక సంస్థలో ఎనిమిదేళ్లుగా జావిద్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న జావిద్‌ను సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా నేత మల్లేశం విశ్వనాథం పరామర్శించి మనోధైర్యం చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 05:59 AM