నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులు.. 16మంది మృతి..
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:24 PM
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా.. సుమారు 37 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా.. సుమారు 37 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో శాంతియుత నిరసన చేస్తున్న వారిపై ఏకే-4 రైఫిళ్లతో పాక్ సైన్యం ఒక్కసారిగా కాల్పులకు తెగబడింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16మంది ప్రాణాలు తీసింది. బియ్యం, విద్యుత్, పిండి వంటి నిత్యావసరాల ధరలు తగ్గించాలని, ప్రాథమిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది శాంతియుత నిరసనలో పాల్గొన్నారు.
పీవోకేలో పాకిస్థాన్ ఆక్రమణలు, విధానాలకు వ్యతిరేకంగా సుమారు 60 వేల నుంచి 70 వేల మంది నిరసన చేపట్టారు. మరోవైపు మంగళవారం నాడు పీఓకేలో భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందిన 30మందికి, గాయపడిన 200మందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈద్గా మైదానం వద్దకు పాక్ సైన్యం చేరుకుంది. ఒక్కసారిగా మెరుపుదాడి చేసి నిరసన కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ఆ ముగ్గురు భారతీయుల మృతి..
త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!