ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ఆ ముగ్గురు భారతీయుల మృతి..
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:59 PM
రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు. సముద్రంలో గల్లంతైన ఆ ముగ్గురు భారతీయులు చనిపోయారు.
న్యూఢిల్లీ, జూన్ 11: హోర్ముజ్ జలసంధి, ఒమన్ తీరప్రాంతంలో తమ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ చమురును రవాణా చేస్తున్న విదేశీ నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు. సముద్రంలో గల్లంతైన ఆ ముగ్గురు భారతీయులు చనిపోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ మీడియాకు వెల్లడించారు.
అమెరికా దాడులు చేసిన సమయంలో నౌకలో మొత్తం 28 మంది ఉన్నారు. వీరిలో 24 మంది భారతీయులు కాగా.. నలుగురు విదేశీయులు ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరు పాకిస్థాన్, ఒకరు ఉక్రేయిన్, ఒకరు రష్యాకు చెందిన వారు ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ నీటిలో గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నీటిలో గల్లంతైన ఆ ముగ్గురూ శవాలై కనిపించారు.
ఇవి కూడా చదవండి
స్ట్రీట్ ఫుడ్ హబ్‌గా భద్రకాళి బండ్
నిమ్మకాయ ఎండిపోయిందా? పారేయకండి.. ఇలా వాడండి