Share News

ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు..

ABN , Publish Date - Jul 27 , 2026 | 08:43 AM

తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ రోజు (సోమవారం) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పీఓకే శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు..
PoK elections 2026

ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ రోజు (సోమవారం) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాకిస్థాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది (PoK elections 2026).


పీఓకే శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఎనిమిదింటిని మహిళలు, సాంకేతిక నిపుణులు, మతపెద్దల కోసం రిజర్వ్ చేశారు. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. జూలై 27న మీర్‌పూర్ డివిజన్‌లోని 13 స్థానాలకు, ఆగస్టు 2న ముజఫరాబాద్ డివిజన్‌తో పాటు శరణార్థుల నియోజకవర్గాలకు, ఆగస్టు 10న పూంచ్ డివిజన్‌లోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి (PoK protests).


ఎన్నికల సందర్భంగా హింస చెలరేగే అవకాశం ఉందన్న అంచనాతో పంజాబ్ ప్రావిన్స్ నుంచి 14 వేల మంది పోలీసులను పీఓకేలో మోహరించారు (PoK assembly polls). ఈ ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.


ఇవి కూడా చదవండి..

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 27 , 2026 | 09:34 AM