Share News

అఫ్ఘాన్‌పై పాక్‌ భారీ వైమానిక దాడులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:59 AM

అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. డ్యూరాండ్‌ లైన్‌ వెంబడి బలూచిస్తాన్‌లోని చమన్‌, గులిస్తాన్‌ సెక్టార్ల వద్ద పాక్‌ సైన్యం జరిపిన భారీ వైమానిక, డ్రోన్‌ దాడుల్లో కనీసం 17 మంది తాలిబాన్‌ సైనికులు మరణించారు

అఫ్ఘాన్‌పై పాక్‌ భారీ వైమానిక దాడులు
pak attacks

  • 17 మంది తాలిబాన్‌ సైనికుల మృతి

ఇస్లామాబాద్‌/కాబూల్‌, సెప్టెంబరు 25: అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. డ్యూరాండ్‌ లైన్‌ వెంబడి బలూచిస్తాన్‌లోని చమన్‌, గులిస్తాన్‌ సెక్టార్ల వద్ద పాక్‌ సైన్యం జరిపిన భారీ వైమానిక, డ్రోన్‌ దాడుల్లో కనీసం 17 మంది తాలిబాన్‌ సైనికులు మరణించారు. తాలిబాన్‌ సైనిక స్థావరాలు, బంకర్లు, లాజిస్టిక్‌ పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్‌ దళాలు గురువారం ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి. మరోవైపు పాక్‌ చేసిన ఆరోపణలను అఫ్ఘాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాక్‌ దాడుల్లో నలుగురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. దీనికి పాక్‌ సైన్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఇటలీ స్కూళ్లలో బురఖాను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగల్ శిల్పం బహూకరణ

Updated Date - Sep 26 , 2026 | 04:02 AM