పాక్‌లో చిన్న రాష్ట్రాల చిచ్చు
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:04 AM
పాకిస్థాన్‌లో చిన్న రాష్ట్రాల చిచ్చు రేగింది
పాక్‌లో చిన్న రాష్ట్రాల చిచ్చు
కరాచీ, నవంబరు 27: పాకిస్థాన్‌లో చిన్న రాష్ట్రాల చిచ్చు రేగింది. ప్రస్తుతం ఉన్న బలోచిస్థాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులను 12 నుంచి 15 ప్రావిన్సులుగా విడగొట్టాలని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ప్రతిపాదన చేశారు. దీనిపై సింధ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం ఇచ్చి సింధూదేశ్‌గా గుర్తించాలంటూ జియే సింధ్ ముత్తహిదా మహజ్ ఆధ్వర్యంలో వేలాది మంది రోడ్డెక్కారు. సింధ్ సరిహద్దులను మార్చే చర్యలను ఒప్పుకోబోమంటూ సింధ్ తరక్కీ పసంద్ పార్టీ ఆదివారం(ఈ నెల 29) కరాచీలో ర్యాలీకి పిలుపునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్