Share News

సౌదీకి యుద్ధ విమానాలు, భారీగా సైనికులు.. పాకిస్థాన్ సహాయం..

ABN , Publish Date - May 18 , 2026 | 08:35 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ భారీ స్థాయిలో సైనిక బలగాలను పంపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే.

సౌదీకి యుద్ధ విమానాలు, భారీగా సైనికులు.. పాకిస్థాన్ సహాయం..
Pakistan Saudi Arabia military pact

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ భారీ స్థాయిలో సైనిక బలగాలను పంపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏప్రిల్ నెలలో సుమారు 8,000 మంది సైనికులను, జేఎఫ్-17 యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌ను, డ్రోన్ యూనిట్లను, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సౌదీకి తరలించిందని సమాచారం (Pakistan Saudi Arabia military pact).


ఇరాన్ దాడులు మరింత పెరిగితే సౌదీ రక్షణకు మద్దతుగా ఉండడం కోసమే పాక్ తన బలగాలను పంపించింది. పాక్, సౌదీ మధ్య గతేడాది కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే మరొక దేశం సహాయం చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఇరాన్ దాడుల కారణంగా సౌదీ చమురు మౌలిక వసతులు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌదీలో ఈ మోహరింపు జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు (Pakistan troops deployment).


పాక్ మాత్రం.. సౌదీలో తమ సైనిక మోహరింపు దాడి కోసం కాదని, ప్రాంతీయ భద్రత కోసం మాత్రమేనని చెబుతోంది (Saudi Arabia Pakistan defence deal). పాక్ ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇరాన్ నుంచి రక్షణ కోసం సౌదీకి బలగాలను పంపించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..


ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 18 , 2026 | 08:39 PM