Share News

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో 550 మందికి పైగా మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 03:53 PM

పశ్చిమాసియాలో మూడో రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గత శనివారంనాడు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతరవకూ ఇరాన్ సుప్రీం లీడర్, ఇతర సీనియర్ అధికారులతో సహా 550 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది.

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో 550 మందికి పైగా మృతి
Us-Israel-Iran War

టెహ్రాన్: పశ్చిమాసియాలో మూడోరోజూ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నారు. అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. క్షిపణి స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ, యుద్ధనౌకలను ధ్వంసం చేస్తోంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కాగా, గత శనివారంనాడు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకూ తమదేశంలో ఇరాన్ సుప్రీం లీడర్, ఇతర సీనియర్ అధికారులతో సహా 550 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.


ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆదేశ మిలటరీ కమాండర్లు ప్రకటించారు. యూఏఈ సహా గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాజా పరిస్థితి యావత్ మధ్యప్రాచ్యాన్ని యుద్ధం వైపు నడిపే అవకాశాలున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్ ఎయిర్ పోర్ట్, బుర్జ్ ఖలిఫా, బహ్మాన్, కువైట్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. మరోపైపు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయానికి ధ్వంసం చేసినట్టు అమెరికా మిలటరీ ప్రకటించింది.


ఒకేదెబ్బకు 48 మంది టాప్ లీడర్లను మట్టుబెట్టాం: ట్రంప్

కాగా, యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ ప్రకటన చేశారు. 'ఆపరేషన్ ఎపిక్ క్యూరీ'లో భాగంగా 'ఒకే షాట్'లో 48 మంది ఇరానియన్ టాప్ లీడర్లను మట్టుపెట్టామని తెలిపారు. 9 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇరాన్ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశామని, ఈ చర్యలో కనీసం ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. యుద్ధం మరో 4-5 వారాలు పట్టవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు బిగ్ షాక్.. కుప్పకూలిన యుద్ధ విమానం.. వీడియో వైరల్

ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..

Updated Date - Mar 02 , 2026 | 04:31 PM