ట్రంప్ రిసార్ట్ సమీపంలో విమాన ప్రమాదం
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:48 AM
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ కౌంటీలో ఆదివారం ఒక బిజినెస్ జెట్ క్షిపణిలా దూసుకొచ్చి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 9మంది అక్కడికక్కడే మరణించారు.
ఫ్లోరిడాలో రహదారిపై కూలిన బిజినెస్ జెట్
అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతి
ఫ్లోరిడా, నవంబరు 2: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ కౌంటీలో ఆదివారం ఒక బిజినెస్ జెట్ క్షిపణిలా దూసుకొచ్చి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 9మంది అక్కడికక్కడే మరణించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన ప్రముఖ రిసార్ట్ మార్-ఎ-లాగోకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. టెక్సా్‌సలోని ఆస్టిన్ నుంచి బహామా్‌సకు బయలుదేరిన ‘లియర్‌జెట్ 60’ విమానం కూలిన చోట రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. నివాస ప్రాంతాలకు, వాహనాలకు దూరంగా పడటంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి