నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ సేఫ్‌ను పగులగొట్టి.. రూ.లక్షల్లో దోచుకొని..
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:11 PM
నేపాల్‌లో భారీ వరదల మధ్య మరో షాకింగ్ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.త్రిశూలీ నదిలో కొట్టుకువచ్చిన ఓ బ్యాంక్ సేఫ్ లాకర్‌ను కొందరు స్థానికులు తెరిచి అందులోని డబ్బును తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో భారీ వరదల మధ్య మరో షాకింగ్ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. త్రిశూలీ నదిలో కొట్టుకువచ్చిన ఓ బ్యాంక్ సేఫ్‌ను కొందరు స్థానికులు తెరిచి అందులోని డబ్బును తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.92.68 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు (Nepal Floods Cash Safe).
సెప్టెంబర్ 10న రాసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో భారీ వరదలకు ఓ నగదు సేఫ్ కొట్టుకుపోయింది. అనంతరం అది ధాడింగ్ జిల్లాలోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4 పరిధిలోని బెల్‌ఖుఖోలా సమీపంలో త్రిశూలి నది ఒడ్డున కనిపించింది. సెప్టెంబర్ 12న కొందరు స్థానికులు సేఫ్‌ను పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈ కేసులో 29 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.92,68,505 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎవరిది? బ్యాంక్ సేఫ్‌లో ఇంకా ఎంత నగదు ఉండేది? ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు (Rs 92 Lakh Cash Recovered).
ఇదే సమయంలో నేపాల్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది (Nepal Flood Crime). నారాయణి నదిలో వరదలకు కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవి పోగులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..