నేపాల్‌లోని గ్లేసియర్ వల్లే విపత్తు
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:48 AM
నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయానికి ఆ దేశంలోని ఒక హిమనీనదమే కారణమని చైనా తెలిపింది. తమ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనం ప్రకారం నేపాల్‌లో టిబెట్ సరిహద్దుకు...
లెండే ఖోలా నదిలో కృత్రిమ సరస్సు ఏర్పడి బద్ధలైంది: చైనా
బీజింగ్, ఆగస్టు 28: నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయానికి ఆ దేశంలోని ఒక హిమనీనదమే కారణమని చైనా తెలిపింది. తమ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనం ప్రకారం నేపాల్‌లో టిబెట్ సరిహద్దుకు సమీపంలో అత్యంత ఎత్తులో ఉన్న ఒక హిమనీనదంలోని కొంత భాగం ఉన్నట్లుండి విరిగి లెండే ఖోలా నదిలో పడటంతో అక్కడ భారీ కృత్రిమ సరస్సు ఏర్పడిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం తెలిపారు. ఆ సరస్సులో భారీగా నీరు చేరి ఒక్కసారిగా బద్ధలవటంతో ఆ నీరంతా భోటెకోశీ నదిలోకి అత్యంత వేగంగా పోటెత్తిందని చెప్పారు. ఆ ప్రాంతంలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలను నిలిపివేసినట్లు వెల్లడించారు. బుధవారం నాటి విపత్తులో తమ భూభాగంలో ఐదుగురు మరణించగా, 547 మంది గల్లంతయ్యారని వివరించారు. అయితే, ఈ విపత్తుకు చైనా నిర్లక్ష్యమే కారణమని నేపాల్ నేతలు ఆరోపిస్తున్నారు. టిబెట్‌లో మొదట వరదలు సంభవించినా ఆ విషయాన్ని సకాలంలో తమకు చైనా చెప్పలేదని, అందువల్లే తమదేశంలో భారీ ప్రాణనష్టం సంభవించిందని నేపాల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు