Share News

నేపాల్‌ వరదల్లో 4,898 మంది గల్లంతు.. అడుగంటిన ఆశలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:31 PM

నేపాల్‌లో సంభవించి ఆకస్మిక వరదల కారణంగా 4,898 మంది గల్లంతయ్యారని ఆ దేశ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశలు కూడా అడుగంటాయని తెలిపారు.

నేపాల్‌ వరదల్లో 4,898 మంది గల్లంతు.. అడుగంటిన ఆశలు

కాఠ్మండ్, సెప్టెంబర్ 05: నేపాల్‌లో సంభవించి ఆకస్మిక వరదల కారణంగా 4,898 మంది గల్లంతయ్యారని ఆ దేశ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశలు కూడా అడుగంటాయని తెలిపారు. అయితే ఈ వరదల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య1,344కు పెరిగిందని చెప్పారు. ఈ మేరకు శనివారం నేపాల్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.


వివిధ ప్రాంతాల్లో శిథిలాల నుంచి 843 మృతదేహాలతోపాటు గుర్తుపట్టలేనంతగా విచ్ఛిన్నమైన 501 శరీర భాగాలు వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 758 మంది పెద్దలు, 85 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. ఇక దేశంలో అంటు వ్యాధులు ప్రబలకుండా1,030 మృతదేహాలకు ఖననం చేసినట్లు చెప్పారు.


ఆగస్టు 26వ తేదీన నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో భారీ హిమ శిల విరిగిపడడంతో.. పెను ప్రళయం ముంచెత్తింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని నేపాల్ పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. నిబంధనల ప్రకారం డీఎన్‌ఏ నమూనాలు సేకరించి 1,030 మృతదేహాలకు భూగర్భంలో సామూహిక ఖననం చేసినట్లు తెలిపారు.


మరో వైపు భారీ హిమ శిల కారణంగా.. ఉత్తర, మధ్య నేపాల్ పరిధిలోని వందలాది గ్రామాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అలాగే ఆ ప్రాంతంలోని పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా ధ్వంసమైనాయి. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాల ఆధ్వర్యంలో 11వ రోజూ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచ పటంలో మార్పులు: ఆఫ్రికా పెద్దగా.. అమెరికా చిన్నగా..

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 05 , 2026 | 12:58 PM