Share News

ఉక్రెయిన్‌తో యుద్ధం.. 5 లక్షల మంది సైనికులను కోల్పోయిన రష్యా..

ABN , Publish Date - May 28 , 2026 | 11:31 AM

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం.. 5 లక్షల మంది సైనికులను కోల్పోయిన రష్యా..
Russia Ukraine war

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు. రష్యా చరిత్రలో ఇదే అతిపెద్ద మానవ వనరుల నష్టమని పేర్కొన్నారు (Russia Ukraine war).


బ్లెచ్‌లీ పార్క్‌లో నిర్వహించిన ఒక భద్రతా సమావేశంలో మాట్లాడిన బట్లర్.. రష్యా ప్రతి నెలా వేల సంఖ్యలో సైనికులను కోల్పోతోందని చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 30 వేల వరకు రష్యా సైనికులు మృతి చెందడమో లేదా గాయపడడమో జరుగుతోందని వెల్లడించారు. అయితే రష్యా మాత్రం ఈ గణాంకాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. యుద్ధంలో జరిగిన నష్టాల వివరాలను మాస్కో చాలా అరుదుగా మాత్రమే వెల్లడిస్తోంది (Russian soldiers killed).


మరోవైపు యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి తాము 55 వేల మంది సైనికులను కోల్పోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించారు (Ukraine war casualties). అయితే ఇరు దేశాలు యుద్ధ నష్టాల గురించి అసలైన గణాంకాలను వెల్లడించడం లేదని అంతర్జాతీయ మీడియా ఆరోపణలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 28 , 2026 | 11:31 AM