Share News

సూట్‌లో 100 కేజీల బరువు ఎత్తిన మంగోలియా అధ్యక్షుడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:27 PM

మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్‌సుఖ్ (58) ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. సూట్‌లోనే 100 కిలోల బరువును బెంచ్‌ప్రెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సూట్‌లో 100 కేజీల బరువు ఎత్తిన మంగోలియా అధ్యక్షుడు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు 100 కేజీల బరువులను ఎత్తడం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. కానీ దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఆ బరువును లిఫ్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది. తాజాగా మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్ సుఖ్(58) కూడా 100కిలోల బరువును బెంచ్ ప్రెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఖురెల్‌సుఖ్.. ఓ సైనిక విభాగాన్ని సందర్శించిన సమయంలో అక్కడున్న జిమ్‌ పరికరాలను చూసి వర్కౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. తన సూట్ జాకెట్‌ను తీసి పక్కన పెట్టి, బెంచ్‌పై పడుకుని 100కిలోల బరువు ఎత్తారు. అది కూడా ఒక్కసారి అయితే పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ఏకధాటిగా 20 సార్లు 100 కేజీల బరువును ఎత్తారు. దీంతో ఐదు పదుల వయసులో కూడా అధ్యక్షుడి బలం, ఫిట్‌నెస్ చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వర్కౌట్ అనంతరం అక్కడ ఉన్న వారితో కరచాలనం చేసి, తిరిగి సూట్ జాకెట్ ధరించారు.


2021 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖురెల్‌సుఖ్, గతంలో మంగోలియా ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాదు, ఆయన ఓ రాక్ బ్యాండ్‌లో గిటారిస్ట్ కూడా. మంగోలియాలో హార్లే-డేవిడ్‌సన్ ఫ్యాన్ క్లబ్‌ను స్థాపించిన ఆయన, ఫిట్‌నెస్ పట్ల తన అభిరుచిని ఈ వీడియో ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు, ఆయనకు ఉన్న శక్తిని, క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారు. బార్‌పై ఉన్న బరువుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన 100 కిలోలు ఎత్తినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.


ఇవి కూడా చదవండి:

కుల్దీప్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీ చరణి!

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

Updated Date - Sep 11 , 2026 | 04:21 PM