అందుకే సుంకాల అమలును ఆపాం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:29 AM
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ వెంటనే నిలిపివేయడం కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ వెంటనే నిలిపివేయడం కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాల నుంచి కూడా కొనుగోళ్లు పెంచుకుంటున్నప్పటికీ, రష్యా నుంచి కూడా గణనీయమైన స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై సుంకాలకు సంబంధించిన బిల్లు అమలును తాత్కాలికంగా నిలిపి వేసిన నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి (India Russian Oil Imports).
రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు అమలు చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశీలించేందుకు ట్రంప్ ప్రభుత్వం 60 రోజుల సమయం తీసుకోవాలనుకుంటోందని రూబియో (Marco Rubio) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే బిల్లు అమలును తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు (US Tariffs on India).
భారత్ ఇప్పటికే ఇంధన దిగుమతులను ఇతర దేశాలకు కూడా విస్తరించుకుందని రూబియో తెలిపారు (US India Relations). అయినప్పటికీ, రష్యా నుంచి వస్తున్న చమురును ఒక్క రోజులోనే పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదని చెప్పారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన మిత్రదేశమని, భాగస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రత, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..