ఇమ్రాన్ తొలగింపు వెనుక అమెరికా హస్తం.. లీకైన రహస్య దౌత్య సమాచారం..
ABN , Publish Date - May 18 , 2026 | 05:29 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందనే సంచలన విషయం తాజాగా బయటపడింది. తాజాగా లీకైన రహస్య దౌత్య 'సైఫర్' (Cypher) పత్రాన్ని పరిశోధనాత్మక ప్రతిక 'డ్రాప్ సైట్' ప్రచురించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందనే సంచలన విషయం తాజాగా బయటపడింది. తాజాగా లీకైన రహస్య దౌత్య 'సైఫర్' (Cypher) పత్రాన్ని పరిశోధనాత్మక ప్రతిక 'డ్రాప్ సైట్' ప్రచురించింది. 2022లో ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తి కారణంగానే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చిందట. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే అమెరికా-పాక్ బంధం బలపడుతుందని అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్లు బయటపడింది (Imran Khan leaked cypher).
2022, ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌తో అగ్రరాజ్య హోంశాఖకు చెందిన సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ సమావేశమయ్యారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించి జైల్లో పెడితే, అమెరికా-పాక్ మధ్య బంధం బలపడుతుందని మజీద్ ఖాన్‌కు డోనాల్డ్ లూ చెప్పారట. ఆ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. (US role in Imran Khan ouster).
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇమ్రాన్ తటస్థ వైఖరి అవలంబించారు. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరి మొదలైన కారణాలే అమెరికా ఆగ్రహానికి కారణమట (Pakistan political crisis). తనను పదవి నుంచి తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతోందని 2022లో ఇమ్రాన్ ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలను అప్పట్లో పాక్ ప్రభుత్వం, అమెరికా ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..