Share News

స్కీయింగ్ చేస్తూ జూ ఏ.. సిగరెట్‌తో కిమ్ జోంగ్ ఉన్.. వైరల్‌గా మారిన ఫొటోలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:03 PM

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆయన ఓ పర్వత పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

స్కీయింగ్ చేస్తూ జూ ఏ.. సిగరెట్‌తో కిమ్ జోంగ్ ఉన్.. వైరల్‌గా మారిన ఫొటోలు
Kim Jong Un

ప్యోంగ్యాంగ్, నవంబర్ 17: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఆయన ఓ పర్వత పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, కుమార్తె స్కీయింగ్ చేస్తుండగా.. కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ తాగుతూ, చిరునవ్వుతో కనిపించిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఉత్తర కొరియాకు చెందిన అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ఈ ఫొటోలను విడుదల చేసింది.


కేసీఎన్ఏ ప్రకారం.. నవంబర్ 15, 16 తేదీల్లో కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి సామ్‌జియోన్‌లోని పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. చైనా సరిహద్దుకు సమీపంలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లో ఈ ప్రాంతం ఉంది. ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జూ ఏ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లటి దుస్తులు ధరించి స్కీయింగ్ చేస్తూ ఆమె కనిపించారు. ఆ ఫొటోలనూ ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. మరో ఫొటోలో కిమ్ జోంగ్ ఉన్ సోఫాలో కూర్చొని ఉన్నారు. చేతిలో సిగరెట్ పట్టుకుని చిరునవ్వుతో కనిపించారు. ఫొటోలో ఆయన వెనుక భార్య రి సోల్ జూ కూడా ఉన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


మరోవైపు, సామ్‌జియోన్ ప్రాంతాన్ని ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే పర్వత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉత్తర కొరియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా స్కీయింగ్ కేంద్రాలు, హోటళ్లు, రవాణా సదుపాయాలు, విమానాశ్రయ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలను పరిశీలించిన కిమ్ జోంగ్ ఉన్ కొన్ని సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేసీఎన్ఏ వెల్లడించింది. అలాగే, సామ్‌జియోన్ విమానాశ్రయ రన్‌వే విస్తరణను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులకు ఆయన సూచించినట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జూ ఏ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిలిప్పీన్స్‌లో చారిత్రక గురుద్వారా పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన

జెన్సన్‌ హువాంగ్‌ రీఎంట్రీకి ఎన్విడియా బోర్డు నో..!

Updated Date - Nov 17 , 2026 | 01:06 PM