కెన్యాలో ఎబోలాతో మరో వ్యక్తి మృతి.. రెండో మరణం నమోదు
ABN , Publish Date - Oct 24 , 2026 | 09:42 PM
కెన్యాలో ఎబోలాతో రెండో మరణం నమోదైంది. రాజధాని నైరోబీలో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో చనిపోయారు. ఎబోలా రకానికి చెందిన బుండిబుగ్యో వైరస్ సోకిన మూడో వ్యక్తి ఆమె అని కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈనెల 23న శుక్రవారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: కెన్యాలో ఎబోలాతో రెండో మరణం నమోదైంది. రాజధాని నైరోబీలో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో చనిపోయారు. ఎబోలా రకానికి చెందిన బుండిబుగ్యో వైరస్ సోకిన మూడో వ్యక్తి ఆమె అని కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈనెల 23న శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం చనిపోయిన మహిళ.. కెన్యాలో ఎబోలా సోకి మరణించిన తొలి వ్యక్తికి దగ్గరి బంధువు. కాంగో నుంచి ఉగాండా మీదుగా ప్రయాణించి వచ్చిన మొదటి వ్యక్తి ఈనెల 5న చనిపోయారు. రెండో మహిళ అక్టోబర్ 13న క్వారంటైన్లో ఉన్న సమయంలో ఆమెలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను ప్రత్యేక అంటువ్యాధుల చికిత్స విభాగంలో చేర్చి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆమెను బతికించేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించారని కెన్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ పాట్రిక్ అమోత్ తెలిపారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశామని, వారి సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
తాజా మరణంతో కెన్యాలో ఎబోలా మృతుల సంఖ్య రెండుకు చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఎబోలా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఏడుగురు ప్రస్తుతం రెండు ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని అధికారులు చెప్పారు. మొత్తం 135 మంది పరిచయస్తులను గుర్తించి క్వారంటైన్లో ఉంచారు. వారిలో మొదటి బృందం ఈనెల 25న క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలకూ వైరస్ సోకింది. వారిని 29, 35, 32 సంవత్సరాల వయసు ఉన్నవారిగా గుర్తించారు. ఈనెల 3, 4న తొలి రోగికి చికిత్స అందించిన సమయంలో వారికి వైరస్ సోకినట్లు సమాచారం. కాగా.. కెన్యాలో తొలి ఎబోలా రోగి కెన్యా పౌరుడు. ఆయన సుమారు ఏడేళ్లపాటు కాంగోలో నివసించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈనెల 3న ఉగాండా మీదుగా కెన్యాకు ప్రయాణించిన ఆయనను ఒక బంధువు నైరోబీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఎబోలా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈనెల 5న ఆయన చనిపోయారు.
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..